Monday, February 3, 2014

పేద‌ల‌కు ఉచితంగా తాగునీరివ్వా‌లి...CPI(M)

-  సిపిఎం పాద‌యాత్ర లో  ఎం శ్రీనివాస్ డిమాండ్
     న‌గ‌రంలో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 1487 మురికివాడ‌ల‌కు ఉచితంగా తాగునీరందించాల‌ని సిపిఎం గ్రేట‌ర్ సిటీ క‌మిటీ కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యు‌లు ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌కు తాగునీరందివ్వ‌డం ప్ర‌భుత్వం హ‌క్క‌ని, కానీ ప్ర‌భుత్వం డ‌బ్బు‌లు వ‌సూలు చేస్తూ వ్యా‌పారంగా మార్చ‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. న‌గరంలో ప్ర‌జాస‌మ‌స్యల అధ్య‌య‌నం వాటి ప‌రిష్కా‌రం కోసం సిపిఎం నిర్వ‌హిస్తు‌న్న పాద‌యాత్ర ఆదివారం ఏడో రోజుకు చేరింది. ముషీరాబాద్ నియోజ‌వ‌ర్గంలోకి క‌వాడిగూడ‌, వాంబే కాల‌నీ, అరుంధ‌తీన‌గ‌ర్‌, గాంధీ న‌గ‌ర్, బాగ్‌లింగంపల్లి ఏరియాల్లో పాద‌యాత్ర కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను సిపిఎం పాద‌యాత్ర బృందంతో ఏక‌రువు పెట్టు‌కున్నా‌రు. ఈ సంద‌ర్భంగా సిపిఎం పాద‌యాత్ర‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తు‌న్న ఎం శ్రీనివాస్ మాట్లా‌డుతూ ప్ర‌జాస‌మ‌స్య‌లను అధికార కాంగ్రెస్ పార్టీ ప‌ట్టించుకోకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. నిత్యం విభ‌జ‌న గోడ‌వ‌ల పేరుతో స‌మ‌స్య‌ల‌ను గాలికొదిలేసింద‌న్నా‌రు. న‌గ‌రంలోని మురికి వాడ‌ల్లో ఉచితంగా నీరందించేందుకు నెల‌కు కేవ‌లం రెండు కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతాయ‌ని దీన్ని కూడా ప్ర‌భుత్వం భ‌రించ‌క‌పోవ‌డం సిగ్గు‌చేట‌ని పేర్కొ‌న్నా‌రు. పెరుగుతున్న ధ‌ర‌లు త‌గ్గించాల‌ని కోరితే ఇటీవ‌ల గ్యా‌స్‌, డీజిల్ ఇత‌ర నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు పెంచింద‌ని పేర్కొ‌న్నారు. ఇవీ చాల‌న‌ట్లు ఎఫ్రిల్ నెల నుంచి క‌రెంటు చార్జీ‌ల‌ను 70 శాతం పెంచేందుకు కుట్ర ప‌న్ను‌తోందని విమర్శించారు. దీనికోసం ఈనెల 4న ఇఆర్‌సి మీటింగ్ కూడా నిర్వ‌హిస్తోంద‌ని, దీన్ని అడ్డు‌కుంటామ‌ని హెచ్చ‌రించారు. రిల‌య‌న్స్, ఇత‌న గ్యా‌స్ ఎజెన్సీ‌ల కోస‌మే క‌రెంటు ఛార్జీ‌లు పెంచుతుంద‌ని విమ‌ర్శించారు. అనంత‌రం సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్య‌ద‌ర్శి ఎం శ్రీనివాస్‌రావు మాట్లా‌డుతూ వాంబే కాల‌నీలో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌లు ప‌డుతున్నా‌ర‌ని పేర్కొ‌న్నా‌రు. మంచినీళ్ల‌లో మురుగు నీరు వ‌స్తున్నా అధికారులు ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్య‌పు స‌మాదానాలు ఇస్తు‌న్నా‌ర‌ని విమ‌ర్శించారు. అర్హు‌లైన పేదలకు ఇళ్ల‌స్థ‌లాలు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. ఈ పాద‌యాత్ర‌లో సిపిఎం నాయ‌కులు ధ‌శ‌ర‌త్‌, నాగ‌రాజు, న‌రేష్‌, కృష్ణ‌నాయ‌క్‌, కుమార స్వా‌మి, జాకిర్‌, విమ‌ల‌, అరుణ‌జ్యో‌తి, వీరాచారీతో పాటు సిపిఎం కార్య‌క‌ర్త‌లు పాల్గొ‌న్నా‌రు.
      ఆలోచింప‌జేస్తు‌న్న పిఎన్ఎం పాటలు  పాదయాత్ర‌లో ప్ర‌జానాట్య‌మండ‌లి బృందం పాడుతున్న పాట‌లు అంద‌రినీ ఆలోచింప‌జేస్తు‌న్నా‌యి. పాల‌కులు ప్ర‌జ‌లు ఎలా భారాలు వేస్తు‌న్నా‌రు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, సిపిఎం ప్ర‌జల ప‌క్షానా నిల‌బ‌డి చేస్తు‌న్న పోరాటాలు, పాద‌యాత్ర తీరును పాట‌ల రూపంలో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తు‌న్నా‌రు. పాద‌యాత్ర‌లో అగ్ర‌భాగాన డ‌బ్బు‌ల ద‌ర‌వుల‌తో న‌డుస్తూ‌, పాద‌యాత్ర‌కు రూపాన్ని తీసుకొస్తు‌న్నా‌రు. పిఎన్ఎం బృందానికి నాయ‌కులు సైదులు, భాస్క‌ర్ నాయ‌క‌త్వం వ‌హిస్తు‌న్నా‌రు.