Friday, September 5, 2014

మూసీ ప్రాజెక్టులో అవినీతి... CPI(M)



మత ఘర్షణలు, విద్యా కాషాయీకరణ... ఇదే మోడీ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం...

మత ఘర్షణలు, విద్యా కాషాయీకరణ... ఇదే మోడీ ప్రభుత్వ తక్షణ కర్తవ్యం...



నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో మతఘర్షణలు పెచ్చరిల్లుతున్నాయిఇప్పటివరకు గుజరాత్కర్ణాటకహర్యానామహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయిఉత్తర ప్రదేశ్ లో అన్నిటికన్నా ఎక్కువగా ఈ ఘర్షణలు చెలరేగాయిఇటువంటి ఘటనలను ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ది పొందాలని బిజెపి ఆరెస్సెస్ లు చూస్తున్నాయిమోరాదాబాద్ లో మహిళపై దాడులకు కూడా మత పరమైన రంగు పులిమి ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారుబిజెపి విజయగర్వంతో వ్యవహరిస్తోందిమైనార్టీలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయిఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉధృతంగా మతతత్వ ప్రచారం చేసింది.విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తున్నాయిశాస్త్రీయ విద్యను అందించాల్సింది పోయివిద్యా కాషాయికరణ కోసం కసరత్తులు చేస్తున్నారుబిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలను తిరగరాసేందుకు పూనుకున్నారువిద్యా వ్యవస్థలో మతతత్వం జొప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందిదేశంలో మతతత్వ శక్తుల ప్రభావాన్నికార్యక్రమాలను తిప్పికొట్టేందుకు రాజకీయ సైద్ధాంతిక కృషి ఇంకా పెరగాలిమతతత్వంవిద్యా కాషాయీకరణను వ్యతిరేకిస్తూ అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని సీపీఎం నిరంతరం పోరాడుతుంది