Thursday, December 29, 2011
Monday, May 16, 2011
దుర్మార్గమైన నిర్ణయం
పెట్రోల్ రేటును లీటర్‌కు ఐదు రూపాయలకు పైగా పెంచడం దుర్మార్గమైన చర్య. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఈ తరహా బహుమానం ఇచ్చింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి. దీనికోసం ప్రజాక్షేత్రంలో సిపిఎం ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఇప్పుడు ఈ భారం వారిని ఆర్థికంగా మరింత కుంగదీస్తుంది. ధరలు పెంచకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదు.
పిఎస్‌ఎన్ మూర్తి, సిపిఎం నగర కార్యదర్శి
Monday, May 2, 2011
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సి.పి.యం. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని సి.పి.యం. నగర కార్యాయంలొ పార్టీ సినియర్ నాయకులు టి.వి. చారి గారు జెండా ఎగురవెశారు.
ప్రపంచ బ్యాంక్ విధానాలు అమలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. పన్నులు పెంచడంపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతనాలు పెంచడంతో ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడే స్ఫూర్తితో వివిధ రంగాల్లో విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్మికులంతా ఏకతాటిపై నడిచి తమ హక్కులను సాధించుకోవాలని పిఎస్‌ఎన్ మూర్తి పిలుపునిచ్చారు.
కార్మికుల ఐక్యతే సమస్యలకు పరిష్కారం...
కార్మికులు ఐక్యంగా ఉంటేనే సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుగా ఉంటుందని సిఐటియు నగర ఉపాధ్యక్షులు పిఎస్‌ఎన్ మూర్తి అన్నారు. మేడేను పురస్కరించుకుని గాంధీనగర్ డివిజన్‌లోని అశోక్‌నగర్‌లోని లేబర్ అడ్డా, గాంధీనగర్ చౌరస్తా, ఆంధ్రకేఫ్, ఎస్‌ఆర్‌టి జవహర్ స్కూల్ ఆటో అడ్డాల్లో సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు.
అశోక్‌నగర్ లేబర్ అడ్డా వద్ద జరిగిన జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై కపట ప్రేమను చూపిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు మేడే ఒక గొప్ప రోజని అభివర్ణించారు. 18 గంటల పని రోజులను ఎనిమిది గంటలకు కుదించుకోవడం కోసం పోరాటం చేసి, విజయం సాధించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ఉనికిని చాటు కోవడానికి పాట్లు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ముందుండాలని, వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని అన్నారు. కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తూ సహజ మరణం పొందిన సదానంద్ భార్య చంద్రకళకు బిసిడబ్యూ ఇన్స్‌రెన్స్ స్కిమ్ కింద 30 వేల రూపాయల చెక్కును పిఎస్‌ఎన్ మూర్తి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం దశరథ్, ఎస్ దశరథ్, రాంచందర్, శ్రీదేవి, క్రిష్ణస్వామి, రాము, రాజు, సాయి రమేష్, ఎల్లయ్య, సోమయ్య, యాకయ్య, వెంకటయ్య, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
Tuesday, April 26, 2011
స్థానిక సమస్యల పరిష్కా రానికి సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర
హైదరాబాద్ లో ఉప్పల్ హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కా రానికి హబ్సిగూడ డివిజన్ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఉప్పల్ జోన్ కార్యదర్శి కె.రవి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు పి.గణేష్, ఐద్వా జోన్ కార్యదర్శి వినోద పాల్గొని రామాంతాపూర్ చెరువులో పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామంతాపూర్ చెరువులోని గుడిసెల్లో సమస్యలు, తాగునీటి సమస్యలు, దోమల సమస్యలు అధికంగా ఉన్నాయని, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులో ఉండడం వలన పాములు, తేళ్ళు అధికంగా వస్తున్నాయని, కరెంటు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.
గాంధీ గిరిజన బస్తీలో రేషన్‌కార్డులు లేవని, రేషన్‌కార్డులు ఉన్నా రేషన్ ఇవ్వడం లేదని మురికినీటి సమస్య, ఇంటి సమస్య ఉందని బస్తీవాసులు వాపోయారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ సిపిఎం నాయకులు జె.వెంకన్న, డివైఎఫ్‌ఐ సెక్రటరీ కె.విజరు, హబ్సిగూడ డివిజన్ కమిటీ ఐద్వా నాయకురాలు నాగలక్ష్మి, అంజమ్మ, సత్యవతి, కైదర్‌బీ, ఆశా, పరంగిని, రుక్కా, కమల, రాజమణి, పార్వతమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
cpi(m) hyd బస్తీవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి : సిపిఎం
హైదరాబాద్ లో ముషీరాబాద్ జోన్ గాంధీనగర్ డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పాదయాత్రలో పలు బస్తీలైన శాంతి యువజన సంఘం, కెవిఎన్ చారినగర్, డప్పులయ్యబస్తీ, ఎస్‌ఆర్టీ క్వార్టర్స్, వాల్మీకీనగర్‌లో పలు సమస్యలు నాయకుల దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శివర్గ నాయకుడు ఎం.దశరథ్ మాట్లాడుతూ వివిగిరినగర్, డప్పులయ్యబస్తీ, అన్నానగర్ బస్తీవాసులకు ఇళ్లపట్టాలివ్వాలని, ఎస్‌ఆర్టీ వాకర్‌గ్రౌండ్‌లో నివసిస్తున్న పేద వారికి గుడిసెలిచ్చి, అర్హులైన వారికి ఇళ్ళపట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. డివిజన్‌లో పాడైన రోడ్లను ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్త చేశారు. రాత్రిపూట వీధి లైట్లు వెలగడం లేదని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య, వితంతువు, వికలాంగ ఫించన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో కన్వీనర్ ఎస్.దశరథ్, రాంచందర్, యాదగిరి, అబ్బురాములు, రమేష్, హరి, హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.
Sunday, April 24, 2011
హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు
హైదరాబాద్ లో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు ప్రారంభించారు. కడప ఉప ఎన్నికల్లో మంత్రులు బిజీగా ఉన్నారు. ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటర్లు తమ వ్యక్తిగత లబ్ధికోసం పాకులాడుతున్నారు. వారికి ల్యాప్‌ట్యాపులు, మెడికల్ రీయింబర్స్‌మెంటు, విదేశీ ప్రయాణాలపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై కరువైంది. అధికారుల్లో అలసత్వం అలుముకుంది. ఈ నేపథ్యంలో నగరంలో స్థానిక సమస్యలపై సిపిఎం పోరు తలపెట్టింది. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు, నాయకులు పాదయాత్రలు చేపట్టారు. మంచినీటి సరఫరా, డ్రెయినేజీ, సివరేజీ, రోడ్లు, వీధిలైట్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు, పొదుపు సంఘాల మహిళలకు గ్యాస్‌కనెక్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఏప్రిల్ 15 నుంచి 150 డివిజన్లలో సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభించారు. కార్యకర్తలు దళాలుగా ఏర్పడి బస్తీల్లో ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ ఇంటిముందుకు వచ్చి సిపిఎం నాయకులు అడిగి తెలుసుకుంటున్నారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రజల నుంచి పాదయాత్రలకు మంచి స్పందన లభిస్తోంది. నాయకులు సమస్యలు తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలపై ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వినతి పత్రాలిచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారుల్లో కొంత మేర చలనం వచ్చి ఆయా ప్రాంతాల్లో కొన్ని సమస్యలు పరిష్కరించారు.
Subscribe to:
Posts (Atom)

