Showing posts with label ధర్నాలు - కార్యక్రమలు. Show all posts
Showing posts with label ధర్నాలు - కార్యక్రమలు. Show all posts
Saturday, November 1, 2014
Tuesday, September 3, 2013
Tuesday, August 27, 2013
Thursday, June 6, 2013
Saturday, April 21, 2012
సర్‌ఛార్జీ వసూళ్లు ఆపాలి
- ఇ-సేవా కమిషనర్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ఇ-సేవాలో సర్‌ఛార్జీల వసూళ్లను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇ-సేవా కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-సేవా కేంద్రాల్లో విద్యుత్ బిల్లులపై యూజర్ ఛార్జీల పేరుతో రూ.2 నుంచి రూ.25 వరకు అదనపు భారం వేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మెజార్టీ వినియోగదారుల దగ్గర ప్రతి బిల్లుపై రూ.5, రూ.10 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. పెంచిన ఛార్జీలతో నగరంలో మార్చిలోనే రూ.45లక్షల భారం పడిందని అన్నారు. అప్పటికే వివిధ రకాల ఛార్జీలు, ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న ప్రజలపై అదనంగా యూజర్ ఛార్జీల వసూలుకు అనుమతించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతి బిల్లుపై విద్యుత్ శాఖ నుంచి ఛార్జీ వసూలు చేస్తూనే తిరిగి ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ బిల్లులపైనే యూజర్ ఛార్జీ వసూలు చేస్తున్నా భవిష్యత్‌లో అన్ని బిల్లులపైనా ఆ భారం వేసే ప్రమాదముందని తెలిపారు. కొత్తగా విధించిన యూజర్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నీటి ఛార్జీలు, అస్తిపన్ను, విద్యుత్ ఛార్జీల పెంపుతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రజలపై ఇ-సేవా వేస్తున్న సర్ ఛార్జీల మోత సామాన్యులకు భారమేనన్నారు.
'ఐదు, పది రూపాయలూ ఓ భారమేనా?' అని అధికారులు, పాలకులు తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శిం చారు. 'ఏ శాఖకు ఆశాఖ ఇ-సేవకు44లో ఛార్జీ చెల్లిస్తున్నప్పటికీ తిరిగి ప్రజలపై భారాలు మోపేందుకు ప్రభుత్వం అనుమతించడం అవసరమా?' అని ప్రశ్నించారు. ఇ-సేవాలో యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని విడుదల చేసిన జిఒ నెంబర్ 31ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
అనంతరం ఎం శ్రీనివాస్, ఎన్ సోమయ్య, ఎస్ సహదేవ్, ఎం వెంకటేశ్, ఇ-సేవా డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఆదినారాయణ, విఠల్, సిఐటియు నాయకులు అజరుబాబు, కిరణ్, కెవిపిఎస్ నగర కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Sunday, January 29, 2012
పెంచిన నీటి ఛార్జీలపై వాటర్ బోర్డు ముట్టడి
- స్వల్ప లాఠీఛార్జి బ నాయకుల అరెస్టు
- వారంలోగా ఛార్జీలు తగ్గించాలి
- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు డిమాండ్
'మేం ఈ భారాలు మోయలేం... పెంచిన నీటి ఛార్జీలు తక్షణం తగ్గించాలి' అని నినదిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగర ప్రజలు వాటర్‌బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. 'నీటి ఛార్జీలు పెంచడమా... సిగ్గు సిగ్గు... ఎమ్డీ బయటికి రావాలి' అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక పక్క వాటర్ బోర్డు అధికారులకు సిపిఎం నాయకులు సమస్య వివరిస్తుండగానే ఖాకీలు వారిని అరెస్టు చేయడం మొదలు పెట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడిచిపెట్టాలని ప్రజలు కార్యాలయం ఎదుటే రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మళ్లీ నాయకులను అరెస్టు చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సుమారు వందమందికిపైగా నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు మహిళలను కూడా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్టయిన వారిలో సిపిఎం హైదరాబాద్ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్ మూర్తి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి.నర్సింహారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్, సోమయ్య, చంద్రశేఖర్, రవి, ఎం.శ్రీనివాస్‌రావు, నగర కమిటీ సభ్యులు ఉన్నారు.
అంతకుముందు కార్యాలయం వద్ద ఆందోళనకారులనుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వారంలోగా తగ్గించాలని లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటర్‌బోర్డు పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొంత మంది బడాబాబులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు చెందిన సుమారు రూ.572 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయకుండా పేదలపై భారం మోపడం సిగ్గుచేటని అన్నారు. పైగా వాటర్ బోర్డు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. జిహెచ్‌ఎంసి వసూలు చేసే ఆస్తిపన్నులో 25 శాతం నిధులను వాటర్‌బోర్డుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2009జిఓ జారీ చేసిందని వివరించారు. అప్పటి నుండి జిహెచ్‌ఎంసి నయాపైసా వాటర్‌బోర్డుకు చెల్లించడంలేదని, ప్రభుత్వం జారీ చేసిన జిఓలను ప్రభుత్వ సంస్థలే ఖాతరు చేయకుంటే సిఎం ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ఎవరు అడ్డొచ్చినా ప్రజా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ తాగునీటితో వ్యాపారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. డిజి.నర్సింహారావు మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నీటి ఛార్జీలు పెంచిందన్నారు. బస్తీలు, కాలనీల్లో ఉన్న పబ్లిక్ నల్లాలను ఎత్తివేసి వాటికి మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు.
వాటర్‌బోర్డు సిజిఎంకు వినతి
వాటర్‌బోర్డు సిజిఎం(రెవెన్యూ) సుందర్‌రాంరెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన మురికివాడల్లో నివసించేవారికి డొమెస్టిక్ ఛార్జీలు వేస్తామని, కమర్షియల్ బిల్లులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నచిన్న షాపులకు డొమెస్టిక్ బిల్లులే ఇస్తామని చెప్పారు.
వాటర్‌బోర్డు సిజిఎంకు వినతి
వాటర్‌బోర్డు సిజిఎం(రెవెన్యూ) సుందర్‌రాంరెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన మురికివాడల్లో నివసించేవారికి డొమెస్టిక్ ఛార్జీలు వేస్తామని, కమర్షియల్ బిల్లులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నచిన్న షాపులకు డొమెస్టిక్ బిల్లులే ఇస్తామని చెప్పారు.
Friday, January 13, 2012
నీటి ఛార్జీల పెంపుపై సమరం
- సెక్షన్ కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు
- కదిలివచ్చిన ప్రజానీకం
- మంచినీటి వ్యాపారం మానుకోవాలి : సిపిఎం
సర్కార్ నీటి వ్యాపారానికి వ్యతిరేకంగా సిపిఎం సమరశంఖం పూరించింది. నగరంలో పలుచోట్ల సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. సర్కార్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మంచినీటి వ్యాపారం నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. మంచినీటి వ్యాపారం మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ ప్రారంభించారని, పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకుంటే ప్రతిఘటన తప్పదని అగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నీటి ఛార్జీలకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని 11 జోన్లలో జలమండలి కార్యాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ధర్నాను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఘోషామహల్ దగ్గర ధర్నాలో ఎం శ్రీనివాసు, సికింద్రాబాద్ జోన్‌లో ఎన్ సోమయ్య, కాప్రా దగ్గర చంద్రశేఖర్, ఉప్పల్ కార్యాలయం దగ్గర రవి, అంబర్‌పేట్ కార్యాలయం వద్ద జోన్ కన్వీనర్ మహేందర్ మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం నగర ప్రజలపై నీటి ఛార్జీల భారాల్ని మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓ పక్క పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ ఇప్పుడు నీటి ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదేంటని పౌరసంఘాలు ప్రశ్నిస్తే జలమండలి నష్టాల్లో ఉందని, తప్పుడు సమాధానం చెపుతున్నారని, ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని అన్నారు. జలమండలి నష్టాలకు మేధావులు, ప్రజాసంఘాలు పరిష్కారాన్ని సూచించాయని, అయినా పట్టించుకోకుండా భారాలు పెంచడం భావ్యం కాదన్నారు. పైపులైన్ల లీకేజీ వల్ల 40 శాతం వృథా అవుతున్న నీటిని అరికట్టడంలో జలమండలి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. జలమండలికి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.147 కోట్లు బకాయిలున్నాయని, బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుండి మరో రూ. 520 కోట్లు బకాయిలను వసూలు చేయలేని చేతగాని స్థితిలో జలమండలి అధికారులు ఉన్నారని విమర్శించారు. గతంలోనే ప్రభుత్వం ప్రాపర్టీ పన్నులో 25 శాతం మంచినీటి బోర్డుకు చెందుతుందనే తీర్మానాన్ని బుట్టదాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. సంవత్సరానికి రూ. 600 కోట్ల రూపాయలు ఆస్తి పన్నుల రూపంలో వసూలవుతోందని, దాంట్లో నుంచే 25 శాతం వాటర్ బోర్డుకు కేటాయించాల్సి ఉందన్నారు. ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఎం దశరథ్ మాట్లాడుతూ మురికి వాడలకు కిలోలీటర్‌కు ఒక్క రూపాయి మాత్రమే పెంచామని, పేదలకు పెద్దగా భారం ఉండదని జలమండలి అధికారులు చెప్పడం కాకమ్మకథలు మాత్రమేనని అన్నారు. ఇప్పటికే బిల్లుల మోత మోగిపోతుందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 15 కిలో లీటర్ల నీటిని వాడుతున్న 3.6 లక్షల వినియోగదారులపై నెలకు రూ. 80 రూపాయల అదనపు భారం పడుతోందని అన్నారు.
Tuesday, April 26, 2011
cpi(m) hyd బస్తీవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి : సిపిఎం
హైదరాబాద్ లో ముషీరాబాద్ జోన్ గాంధీనగర్ డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. సోమవారం నిర్వహించిన పాదయాత్రలో పలు బస్తీలైన శాంతి యువజన సంఘం, కెవిఎన్ చారినగర్, డప్పులయ్యబస్తీ, ఎస్‌ఆర్టీ క్వార్టర్స్, వాల్మీకీనగర్‌లో పలు సమస్యలు నాయకుల దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శివర్గ నాయకుడు ఎం.దశరథ్ మాట్లాడుతూ వివిగిరినగర్, డప్పులయ్యబస్తీ, అన్నానగర్ బస్తీవాసులకు ఇళ్లపట్టాలివ్వాలని, ఎస్‌ఆర్టీ వాకర్‌గ్రౌండ్‌లో నివసిస్తున్న పేద వారికి గుడిసెలిచ్చి, అర్హులైన వారికి ఇళ్ళపట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. డివిజన్‌లో పాడైన రోడ్లను ఇప్పటికీ పట్టించుకోకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్త చేశారు. రాత్రిపూట వీధి లైట్లు వెలగడం లేదని వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య, వితంతువు, వికలాంగ ఫించన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో కన్వీనర్ ఎస్.దశరథ్, రాంచందర్, యాదగిరి, అబ్బురాములు, రమేష్, హరి, హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.
Saturday, April 23, 2011
బాగ్ లింగంపల్లి డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని పాదయాత్ర
హైదరాబాద్ లో ముషీరాబాద్ జోనులోని బాగ్ లింగంపల్లి డివిజన్‌లోని స్థానిక సమస్యలు పరిష్కరించాలని సిపిఎం బాగ్ లింగంపల్లి కమిటీ ఆధ్వర్యంలో బాగత్ సింగ్ నగర్, శ్రిరాం నగర్, సంజయ్ నగర్, అచ్చయ్య నగర్, పాలమూరు.... బస్తీలలో కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఎం కార్యదర్శి పి.ఎస్.ఎన్.మూర్తి, ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్న స్థానిక బస్తీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు. రేషన్ సమస్యలు, పెన్షన్లు తదితర సమస్యలతో సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు స్థానికుల సమస్యలను గాలికి వదిలేసి వారి పనులను చక్కబెట్టుకుంటునరన్నారు. బస్తీలలోని ప్రజలు అనేక సమస్యలను ఈ పాదయాత్రలో నాయకులకు తెలిపారు.
రాజీవ్‌గృహకల్ప కోసం కట్టిన డబ్బులు ఆరు సంవత్సరాలు కావస్తోన్న ఇంత వరకు ఇళ్ళు ఇవ్వలేదన్నారు. డ్రెయినేజీవ్యవస్థ సరిగాలేక నిత్యం రోడ్డుపైన మురుగునీరు చేరుతుందన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు రావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర లో సిపిఎం ముషీరాబాద్ జోను కార్యదర్శివర్గ సభ్యులు పి. గెల్వయ్య, డివిజన్ నాయకులు జి.రాములు, వెంకన్న, రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)










